Ration Card: కొత్త రేషన్ కార్డు కావాలా? ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త ఆన్‌లైన్ రూల్ తెలుసుకోండి!

WhatsApp Group Join Now

ఊర్లో ఉండే మన రేషన్ కార్డు దారులందరికీ ఒక మంచి మాట! | Ration Card Services AP MeeSeva

ఇన్నాళ్లూ రేషన్ కార్డులో పేరు మార్చాలన్నా, కొత్త వాళ్ళని చేర్చాలన్నా, ఆఖరికి కార్డు చిరిగిపోయి కొత్తది కావాలన్నా సచివాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వచ్చేది కదా. అక్కడ జనం రద్దీ, అధికారులు వేరే పనుల్లో ఉండటం వల్ల మన పని అవ్వడానికి గంటల తరబడి కనిపెట్టుకుని ఉండాల్సి వచ్చేది.

ఈ తిప్పలన్నిటికీ చెక్ పెడుతూ మన ఏపీ ప్రభుత్వం (కూటమి సర్కార్) ఒక అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రేషన్ కార్డు సేవలు అన్నీ ‘మీ సేవ’ (Meeseva) కేంద్రాల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా చాలా సులువుగా చేసుకోవచ్చు.

మీ సేవలో ఏమేం చేసుకోవచ్చు?

మొత్తం 9 రకాల పనులు మన ఊరి దాటకుండానే మీ సేవలో చేసుకోవచ్చంట. అవేంటంటే:

  1. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం.

  2. కార్డులో ఉన్న సభ్యులను తీసేయడం.

  3. కొత్తగా పుట్టిన పిల్లలను లేదా కోడళ్ళను కార్డులో చేర్చడం.

  4. ఉమ్మడి కార్డును విడగొట్టి వేరే కార్డు చేసుకోవడం (కార్డు విభజన).

  5. పాత కార్డును ప్రభుత్వానికి అప్పగించడం (స్వాధీనం).

  6. కార్డులో తప్పులు ఉంటే సవరించుకోవడం (అప్‌డేట్).

  7. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయడం.

  8. కార్డు పోతే డూప్లికేట్ కార్డు తెచ్చుకోవడం.

  9. రేషన్ షాపు వివరాలు మార్చుకోవడం.

ఏం పత్రాలు కావాలి?

ఈ పనులు చేసుకోవడానికి కొన్ని కాగితాలు అడుగుతారు, అవి జాగ్రత్తగా పట్టుకెళ్ళండి:

  • కొత్త కార్డు కోసం: పెళ్లి పత్రిక లేదా పెళ్లి రిజిస్ట్రేషన్ కాగితం, అందరి ఆధార్ కార్డు జిరాక్సులు, ఫొటోలు.

  • పేర్లు, పుట్టిన తేదీలు మార్చాలంటే: ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate).

  • చిరునామా (అడ్రస్) మార్చాలంటే: ఆధార్ కార్డ్, కరెంట్ బిల్లు లాంటివి.

ముఖ్యమైన విషయం: కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి ఎలాంటి గడువు లేదు. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకున్నాక అధికారులు వచ్చి మన ఇల్లు, పొలం, ఆస్తిపాస్తులు అన్నీ చూసి, మనకు అర్హత ఉంటే ‘స్మార్ట్ రేషన్ కార్డు’ ఇస్తారు.

కాబట్టి, రేషన్ కార్డులో ఏమైనా పనులు ఉంటే సచివాలయానికి వెళ్ళి లైన్లో నిలబడక్కర్లేకుండా, హాయిగా మీ సేవ కేంద్రానికి వెళ్ళి పని కానిచ్చేయండి!

WhatsApp Group Join Now

Leave a Comment

WhatsApp